బతుకంతా నీ కోసం.. పరితపిస్తూ జీవించా.. ఎదురు చూపులు చూస్తూ.. ఎందరినో ప్రేమించా..

Monday, November 24, 2008

తొలి తెలుగు ఎయిడ్స్ కవితలు -2



పులి రాజు ఊరి మీద పడితే


నెల రాజుకైనా ఎయిడ్స్ వస్తుంది


పులికి వాతలు పెట్టండి


ఆడ వాళ్ళంటే


హడలి చస్తుంది




***********

మనుషుల్ని కుట్టడానికి దోమలు భయపడుతున్నాయి

ఎయిడ్స్ గుర్తుకొచ్చి గజ గజా వణుకుతూ రొదపెడుతున్నాయి

ఇంత చెప్పినా సిగ్గు రాని జంటలు

నడి చీకట్లో 'అడ్డు' లేకుండా కలుసుకుంటున్నాయి

*********

ముసి ముసి నవ్వులతో మురిపించింది

అడుగడుగున వలపు వాన కురిపించింది

హెచ్చైవీ లక్షణాలు కనబడగానే

నరకానికి ద్వారాలు తెరిపించింది

***********

ఎండ్లూరి సుధాకర్

No comments: