Saturday, February 21, 2009
నజరానా (ఉర్దూ కవితలు)-5
*మొత్తం ఆ వీధికంతా
నా ఒక్క కొంప లోనే దీపం లేంది
ఆ చీకటే చాలు నీకు
నా చిరునామా చెప్పేస్తుంది.
- బాకీ అహమద్ పురీ
*తెల్లారిపోయినా ఆ కొవ్వొత్తి
ఇంకా ఏడుస్తుంది దేనికని ?
"ఇంకొద్దిగా మిగిలాను
ఇది కూడా కరిగిపోవాలని"
-ఆగ్ జాన్ 'ఏష్ '
*ఆమె నగ్నసౌందర్యం మీద
పరుచుకున్నాయి కురులు
ఒకే సారి ఉదయించాయి
రేయీ మరియూ పవలూ
- హీరాలాల్ పలక్
*'మనసు ఎలా వుంటోందని '
ఆమె నవ్వుతూ అడిగింది
ఒక కన్నీటి చుక్క దొరలి
అలా నిలిచి పోయింది.
-మహిరూల్ కాదరీ
*ఎలాగైతేనేం? ఆమె కళ్ళు
అశ్రు బిందువులు వర్షించాయి
ఆమె చిరు నవ్వుల బరువు కూడా
ఆ నయనాలు మోయలేక పోయాయి
-ఖామోష్
*వెన్నెలని చూసుకునే కదా
చంద్ర బింబం మిడిసి పడుతోంది
ప్రియా! ఒక్క సారి
నీ ముసుగు తీస్తే నిజం తెలుస్తుంది .
-సాహిల్ మానక్ పురీ
-తెలుగు అనువాదం :ఎండ్లూరి సుదాకర్
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
adbutamgaa vastunnaayandi
dhanyavaadamulu
*'మనసు ఎలా వుంటోందని '
ఆమె నవ్వుతూ అడిగింది
ఒక కన్నీటి చుక్క దొరలి
అలా నిలిచి పోయింది.
-మహిరూల్ కాదరీ
*వెన్నెలని చూసుకునే కదా
చంద్ర బింబం మిడిసి పడుతోంది
ప్రియా! ఒక్క సారి
నీ ముసుగు తీస్తే నిజం తెలుస్తుంది .
-సాహిల్ మానక్ పురీ
ఈ రెండు కవితలూ ఎంత భావుకతతో ఉన్నాయండీ.. మనసు ఉంటేనే కదా కరిగిపోయేది. అద్భుతంగా ఉంది.
సర్,
మొదటి కవితలో"కొంపలోనే" అనే కంటే"ఇంటిలోనే" అంటే ఇంకా బాగుంటుందేమో కదా. ఒకసారి చూడండి.
Post a Comment