బతుకంతా నీ కోసం.. పరితపిస్తూ జీవించా.. ఎదురు చూపులు చూస్తూ.. ఎందరినో ప్రేమించా..

Friday, March 20, 2009

నజరానా(ఉర్దూ కవితలు)


*బతుకంతా నీ కోసం

పరితపిస్తూ జీవించా

ఎదురు చూపులు చూస్తూ

ఎందరినో ప్రేమించా

-హఫీజ్ హొషియార్ పురీ


*ఆకులకీ గడ్డి పరకలకీ

అవగతమే నా దుస్థితి

తోటకంతా తెలుసు గానీ

తెలియందల్లా పూలకే నా గతి


_ మీర్ తకీ మీర్


*నా కన్నీటి కబురు

ఆమె చెవిదాకా ఎవరు చేర్చారు?

నా గుండె గుట్టు నలుగురిలో

ఎవరు సుమా రచ్చకీడ్చారు ?

_నాతిక్ గులావఠీ


తెలుగు అనువాదం :డా.ఎండ్లూరి సుధాకర్

2 comments:

kasturimuralikrishna said...

అనువాదంతో పాటూ మూల కవితలనూ ఇచ్చివుంటే, మూలాంతో అనువాదాన్ని పోల్చి చూసి ఆనందాన్ని అనుభవించే వెల్లు చిక్కేది. అనువాదకుడి ప్రతిభను గుర్తించే వీలు చిక్కేది.మరోసారి ఇలా చేస్తే బాగుంటుంది.

Yendluri Sudhakar ఎండ్లూరి సుధాకర్ said...

పుస్తక రూపంలో వచ్చేప్పుడు అలా చెయ్యటానికి ప్రయత్నిస్తాను.ధన్యవాదాలు.