Wednesday, May 27, 2009
నజరానా {ఉర్దూ కవితలు}
*పనిగట్టుకొని ఆమె చిత్రపటాన్ని
పది మందికీ చూపించాను
ప్రతి ఒక్కడితో ఇప్పుడు
పగను కొని తెచ్చుకున్నాను
-ఆజాద్
*నీకు చాలా దూరంలో ఉన్నాను
నీ మీదే మనసు పెట్టుకున్నాను
నీ చిరునామా దొరికినా దొరక్కపోయినా
నీ కోసం మాత్రం నీరీక్షిస్తూనే ఉంటాను
-వహషత్ కలకత్తవీ
*మనసుతో చెప్పే వాణ్ని
అలాంటి బాటలో నడవద్దని
ఎదురు దెబ్బలుతిని పడింది
అనుకున్నాను తగిన శాస్తి జరిగిందని
-అష్రఫ్ రాహాబ్
తెలుగు అనువాదం :ఎండ్లూరి సుధాకర్
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
సుధాకర్ గారు ఈ ఫోటో ని చూస్తే నాలోని తెలియని భావం బయటకు అక్షరాల రూపంలో వస్తుంది.....
నిండు పున్నమి నాడు చంద్రునికి బదులుగా నీ ముకార విందాన్ని చూస్తూ నీ కోసం పడి తపించే నీ ...........
మీ ఫోన్ స్నేహితుడు
ఆదిబాబు
Post a Comment