బతుకంతా నీ కోసం.. పరితపిస్తూ జీవించా.. ఎదురు చూపులు చూస్తూ.. ఎందరినో ప్రేమించా..

Thursday, September 16, 2010

తెలుగు రుబాయీలు



*ఉత్తరం అందగానే హృదయం కంపించింది
అక్షరమక్షరం లో   ఆమె రూపు కనిపించింది
మేఘంలా ఆమె ముందు వాలిపోయి వసీరా!
జల్లు జల్లుగా  కురవాలని అనిపించింది.
   
*ఇన్నాళ్ళకు చూసినందుకేమో  ఏడుపు ఆగటం లేదు
వెళ్లి పలకరిద్దామంటే అడుగు సాగటం లేదు
ఊరుకో బేల హృదయమా ! ఊరుకో
ఎంత కప్పి పెడుతున్నా గాయం దాగటం లేదు .

*ఒకేసారి ఇద్దరిని  కట్టుకున్నాడు
ఇద్దరికీ తెలియకుండా తృతీయను పెట్టుకున్నాడు
కొమ్మలిద్దరు మొగుణ్ణి కోర్టుకీడ్చితే
గొల్లుమంటూ తల గోడకేసి కొట్టుకున్నాడు .

*కలిసి చచ్చి పోదామంది  కలికి
పడ్డాడు ప్రియుడు అదాటున ఉలికి
నీకూ నీ ప్రేమకూ నమస్కారం  ప్రియ మణీ!
బ్రతుకు జీవుడా !అన్నాడు శుభం పలికి .

 -ఎండ్లూరి సుధాకర్

2 comments:

ఎం. ఎస్. నాయుడు said...

నమస్తే సర్. బాగున్నాయి.

gajula said...

మమ్ములను ఆకాశంలోకి తీసికెళ్ళి ,మా గుండెలను పిండి ,కట్టుకుని-పెట్టుకుని తల గోడకేసి కొట్టుకున్న జైలుపక్షిని చూపించి ,ఇంకా ఏమి జరుగుతుందో చుద్దామనేసరికి నిర్దాక్షినంగా మమ్ములను క్రిందకి తోసి మీరు నవ్వుతార ?