బతుకంతా నీ కోసం.. పరితపిస్తూ జీవించా.. ఎదురు చూపులు చూస్తూ.. ఎందరినో ప్రేమించా..

Monday, February 9, 2009

నజరానా(ఉర్దూ కవితలు)-4


*నేను అనుకునే వాణ్ణి

ప్రేమంటే ఫ్రణయ కలాపం

ఆ తరువాత తెలిసింది

అది ఒక రుధిర విలాపం .


-అసర్ లఖ్నవీ


*చాలా అందమైనవి నీ కళ్ళు

తెల్లవార్లూ మేలుకోకు

సహజ నిద్ర పడుతుందిలే

నా ఆలోచన రానీయకు .


_హసన్‌ కాజ్మీ


*ఈడ్చుకొని వెళ్ళింది

మనసు నీ దగ్గరికి

ఏం చెప్పాలో చెప్పు ?

అది చేసిన పిచ్చి పనికి .


_ రషీద్ సిద్ధిఖీ


*హాయిగా ఏడ్చుకునే

స్వేచ్ఛ కావాలి ఫానీ

ఇది ఆమె వుండే వీధి

తెలుసుకో !నీ దు:ఖశాల కాదని .


_ఫానీ


*బహుశా వైద్యంతోనైనా

కుదురుకుంటుందేమో చావు

కానీ జీవితాన్ని మాత్రం

బాగు చేసే మందులేవీ లేవు.


_ఫిరాఖ్



*నా పేరు నేల మీద రాసి

మళ్ళీ చెరిపేసింది

ఆమెకది ఒక ఆట

కడకదే నన్ను మట్టి పాలు చేసింది.


-నవాజ్ మహల్ అఖ్తర్


-తెలుగు అనువాదం :ఎండ్లూరి సుధాకర్

5 comments:

Indian Minerva said...

వీటి ఉర్దూ మూలాన్నికూడా కాస్త ఇవ్వరూ?

Indian Minerva said...
This comment has been removed by the author.
డా.ఆచార్య ఫణీంద్ర said...

అనువాద కవితలు అందంగా రూపు దిద్దుకొన్నాయి.
అభినందనలతో
- డా.ఆచార్య ఫణీంద్ర

sathipadma said...

mee blog chadivanu. mee kavitalu chala bagunnayi. naa lanti urdu rani vari ki kooda aa kavitala loni madhuryanni aasvadinche avakasam kaliginchi nanduku vandanalu.

జ్యోతిర్మయి said...

సుధాకర్ గారూ... మూర్తిగారి బ్లాగులో మీ లింక్ చూసి ఇలా వచ్చాను. ఉర్దూ రాని మాలాంటి వారికి చక్కని కవితలను పరిచయం చేశారు. ధన్యవాదములు.